AKP: అనకాపల్లి పట్టణం విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జ్ సమీపంలో చెత్త కారణంగా పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా తయారైంది. వర్షాలకు చెత్త నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల ప్రజలు పలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా చెత్త కారణంగా దోమలు వృద్ది చెంది రోగాలు వ్యాపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. డంబర్ బిన్ బాక్స్‌ను ఇక్కడ నుంచి మార్చాలని కోరుతున్నారు.