భగవద్గీత జ్ఞానామృతమని, భారత నాగరికత చరిత్రకు సూక్ష్మ రూపమని ప్రముఖ చైనా పండితులు పేర్కొన్నారు. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో ‘సంగమం-భారతీయ తాత్విక సంప్రదాయాల సమ్మేళనం’ అనే అంశంపై జరిగిన చర్చలో చైనా పండితులు ప్రసంగించారు. భారతదేశ ఆధ్యాత్మిక దృక్ఫథాన్ని భగవద్గీత వెల్లడిస్తుందని, దాని ఆలోచనలు నేటికీ భారతదేశాన్ని నడిపిస్తున్నాయని పేర్కొన్నారు.