VSP: విశాఖలోని పలు పోలీస్ స్టేషన్లలో రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎయిర్ పోర్ట్ సీఐ ఉమా మహేశ్వరరావు రౌడీ షీటర్లకు సత్ప్రవర్తనతో మెలగాలని, నిత్యం పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో తలదూర్చకుండా ఉండాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు.