హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్ల సమక్షంలో నేడు ఉదయం 11 గంటలకు మద్యం షాపులకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. శంషాబాద్, సరూర్ నగర్ డివిజన్లలోని మద్యం దుకాణాలకు శంషాబాద్ మల్లికా కన్వెన్షన్ సెంటర్లో లక్కీ డ్రా నిర్వహించనుండగా.. దరఖాస్తుదారులు ఉదయం 9 గంటల వరకు ఆయా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.