HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు ఉండగా వారికి ఎన్నికల అధికారులు గుర్తులను కేటాయించారు. పెద్దసంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో యాపిల్, ద్రాక్ష, గాలి కొట్టే పంపు, బెలూన్, బేబీ వాకర్, కూలర్, టీవీ రిమోట్, గ్యాస్ స్టవ్, బెల్ట్ తదితర గుర్తులను కేటాయించారు. అయితే ఈ గుర్తులను అభ్యర్థులు ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది.