E.G: ప్రకృతి విపత్తుల వల్ల ఎర్రకాలువ ముంపుకు పంట నష్టపోకుండా రైతాంగాన్ని అప్రమత్తం చేయాలని మంత్రి కందుల దుర్గేశ్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి ఫోన్ కాల్లో సూచించారు. ఎర్రకాలువ గట్లు తెగకుండా పటిష్టం చేయడానికి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. ‘మొంథా’ తుపానుపై ప్రజలను అప్రమత్తం చేసి, సహాయక చర్యలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.