KDP: వల్లూరు పంచాయతీ పరిధిలోని అంకాలపల్లి బాలుగారిపల్లి గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సుమారు 50 ఎకరాల్లో వరి పంట నేలకొరిగి తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను ప్రభావంతో నాశనం కావడంతో తీవ్రంగా నష్టపోయారు. గ్రామ వ్యవసాయ సహాయకుడు నష్టాన్ని పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు.