W.G: ‘మొంథా’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మండల, డివిజన్, జిల్లా స్థాయిలో రద్దు చేసినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ‘మొంథా’ తుఫాన్ కారణంగా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.