VKB: ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందడానికి దోమ మండలంలోని పేద ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని HP గ్యాస్ డీలర్ విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. తెల్లరేషన్ కార్డు ఉన్న పేద మహిళలు అర్హులని తెలిపారు. దరఖాస్తుతో పాటు డిజిటల్ రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, మహిళా బ్యాంకు పాస్బుక్, రెండు పాస్ ఫొటోలు జత చేయాలని ఆయన సూచించారు.