KNR: కేంద్రంలోని ఓల్డ్ విద్యానగర్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో సుమారు 100 కుటుంబాలు ఓటు వేశాయి. చంద్రగిరి శ్రీనివాసు అధ్యక్షుడిగా, కర్రె రాజేందర్ ఉపాధ్యక్షుడిగా, అమరగొండ రాజు ప్రధాన కార్యదర్శిగా, చెదురువెళ్లి రాజగోపాల్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి కాలనీ వాసులు శుభాకాంక్షలు తెలిపారు.