ప్రకాశం: మొంథా తుఫాన్ ప్రభావంతో రానున్న 2,3 రోజుల్లో ప్రకాశం జిల్లాకి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పాకాల సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో బీచ్ సందర్శకులను, కార్తీకమాస స్నానమాచరించే వారిని తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. అలాగే సముద్రతీరాన ఎర్రజెండా ఎగురవేసి రెడ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.