CTR: పుత్తూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న టీ.ప్రకాష్ అనే హెడ్ కానిస్టేబుల్ అనారోగ్యం కారణంగా సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ప్రకాష్ వెస్ట్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుండగా పుత్తూరుకు ఇటీవల అటాచ్ చేశారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు, పలువురు పోలీసులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.