KNR: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించే ఏక్తా దివస్, ఐక్యత మార్చ్ ప్రోగ్రామ్లను విజయవంతం చేయడానికి బీజేపీ శ్రేణులు తగిన కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ఈనెల 31న ఐక్యత మార్చ్, ఏక్తా దివస్, సర్దార్ వల్లభాయ్ జయంతిని బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.