PPM: మొంథా తుఫాన్ ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని మన్యం జిల్లా ఇంఛార్జ్ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యుత్, తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరారు. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదన్నారు.