MBNR: కురుమూర్తి జాతర సందర్భంగా మహబూబ్ నగర్ బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుజాత తెలిపారు. నేటి నుంచి ఈనెల 30 వరకు కురుమూర్తి జాతర నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రయాణికులు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.