GNTR: జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తుఫాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని సోమవారం తెలిపారు. ఎంఈవోలు మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలి. తుఫాను షెల్టర్ల ఏర్పాటులో తహశీల్దార్లకు, ఎంపీడీవోలకు సహకరించాలని సూచించారు. డీఈవో కార్యాలయంలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.