SKLM: మొంథా తుఫాన్ హెచ్చరికల నేపధ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. రాష్ట్ర ప్రభుత్వ హెచ్చరికల నేపధ్యంలో తుఫాన్ ప్రభావం ఈ నెల 28,29 తేదిల్లో ఉన్నట్లు తెలిపారు. వర్షాలతో పాటు, సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అన్నారు. రైతులు ఆందోళన చెందొద్దన్నారు.