GNTR: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు (SMEs) ప్రభుత్వం తగిన సహాయం అందిస్తుందని తెలిపారు. ఆదివారం గుంటూరు సిటీ బేరింగ్ డీలర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నూతన పారిశ్రామిక విధానం పరిశ్రమలకు ఊపిరి పోస్తోందన్నారు. ‘ఇంటికో పారిశ్రామికవేత్త’ లక్ష్యంతో ప్రభుత్వం అన్ని రకాల సహాయ చర్యలు అందిస్తోందని తెలిపారు.