కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో తుఫాన్ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తరలించేందుకు పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సెక్రటరీ లక్ష్మీకాంత్ సోమవారం తెలియజేశారు. పునరావస కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలు ఎవరు భయపడవలసిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.