MBNR: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వంశపారంపర్య సంప్రదాయాలు, సామాజిక ఐక్యతకు ప్రధాన కేంద్రంగా నిలుస్తున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రతి కులానికి, వృత్తికి ప్రత్యేక హోదా ఉంది. అర్చకత్వం, పల్లకి మోయడం, స్వామివారి పాదుక, చాట తయారీ, నివేదనకు మట్టిపాత్ర అందించడం, మేళతాళాలు వంటి సేవల్లో అన్ని వృత్తుల వారు సమానంగా పాలుపంచుకుంటున్నారు.