HNK: కాజీపేట మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని ఆదివారం జిల్లా సహాయ కార్యదర్శి ఎం చుక్కయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో పెచ్చరిల్లుతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య పాల్గొన్నారు.