KMM: సత్తుపల్లి డిపోలో సోమవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఊటుకూరి సునీత ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికులు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఫిర్యాదులు, సలహాలు, సూచనల కొరకు 9959225962 నెంబర్ను సంప్రదించాలని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.