SS: పెనుకొండ మండలం కురుబవాండ్లపల్లిలో పెనుకొండ సీఐ రాఘవన్, కియా ఎస్ఐ రాజేష్ శుక్రవారం సాయంత్రం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత చర్యలు గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని, అతివేగంగా డ్రైవింగ్ చేయరాదని తెలిపారు. అలాగే స్త్రీలపై నేరం, పోక్సో కేసులు, ఆస్తి నేరాలు, ఆన్లైన్ మోసాలపై వివరించారు.