HNK: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ఎల్కతుర్తి నుంచి ముల్కనూర్ వైపు వెళ్తున్న కారు బోల్తా పడింది. రహదారిపై గేదెలు అకస్మాత్తుగా ఎదురుగా రావడంతో డ్రైవర్ అప్రమత్తమై వాటిని తప్పించబోయి కారు పల్టీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.