SDPT: మాదిగ ఉద్యోగ జాగృతి ఆవిర్భావ సభ కరపత్రాన్ని సిద్దిపేట ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆవిష్కరించారు. మాదిగ జాగృతి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా. అంజయ్య మహారాజు మాట్లాడుతూ.. మాదిగ జాగృతి సంఘం అనుబంధంగా మాదిగ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, వృత్తిదారులు, రిటైర్డు ఉద్యోగులు ఐక్యంగా ఉండి, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు, సామాజిక భద్రత కోసం సభ ఏర్పాటు చేస్తామన్నారు.