MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని శనివారం ఇంగ్లండ్‌కు చెందిన మిచల్ రిచర్డ్, ఎలిజబెత్ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ గైడ్ వారికి ఆలయ ప్రాముఖ్యతను వివరించారు. ఆలయ శిల్ప సౌందర్యం, చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకుని ఆనందం వ్యక్తం చేశారు.