KDP: బ్రహ్మంగారిమఠంలోని బ్రహ్మం సాగర్ జలాశయాన్ని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. జలాశయంలో నీటి నిల్వ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జలాశయంలో 15. 3 టీఎంసీలు నీరు నిల్వ ఉందన్నారు. కుడి కాలువకు వంద క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు పాల్గొన్నారు.