NZB: ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల విద్యార్థిని దక్షిణ మండల అంతర విశ్వవిద్యాలయ కబడ్డీ (మహిళ) టోర్నమెంట్ 2025కు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ చంద్రిక తెలిపారు. కళాశాలకు చెందిన ఉమాభారతి ఎంపికైందన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమన్నారు. అధ్యాపక బృందం సభ్యులు విద్యార్థినిని అభినందించారు.