SRPT: వాతావరణ మార్పుల నేపథ్యంలో చేతికొచ్చిన పంట నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారని, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో ఓ పత్రిక ప్రకటనలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సంచులు లేక తీర ఇబ్బందులు పడుతున్నారని, తమ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని ఆయన అన్నారు.