KDP: యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ నచికేత విశ్వనాథ్ పిలుపునిచ్చారు. ఎస్పీ కార్యాలయంలో DYFI కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన ‘Say No To Drugs’ పోస్టర్లను ఆవిష్కరించారు. డ్రగ్స్ వ్యసనం ఒక సామాజిక వ్యాధిగా మారిందని, యువతను కాపాడెందుకు కృషి చేయాలన్నారు.