MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామ ప్రవేశంలో ఉన్న ఊరు పేరును సూచించే బోర్డు చుట్టూ కంప చెట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ మార్గంలో దూరప్రాంతలకు ప్రయాణించే వాహనదారులకు బోర్డు కనిపించకుండా ఉందని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చెట్ల కొమ్మలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.