ADB: వనవాసి కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో అచ్చంపేటలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని, తొడసం కైలాస్ మాస్టర్ రచించిన “సోభత ఖడి” సుందరకాండ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవి దేవి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తదితరులు పాల్గొన్నారు.