ATP: వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 28న నిర్వహించాల్సిన ప్రజా ఉద్యమం ర్యాలీని వాయిదా వేసినట్లు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని రద్దు చేశామని వెల్లడించారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.