ప్రకాశం: కంభం మండలంలోని లింగోజిపల్లి గ్రామంలో గల మిరప పంటను ఆదివారం ఉద్యాన శాఖ అధికారి శ్వేత పరిశీలించారు. ఇందులో భాగంగా ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా మిరప పంటలో అధికంగా ఉన్న నీటిని బయటికి పంపించే ఏర్పాటు చేయాలని రైతులకు సూచించారు. అనంతరం పంట తేరుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.