SRPT: మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో ఆదివారం జరిగిన అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజ శ్రేయస్సుకు దోహదపడతాయని ఆయన అన్నారు. కోదాడ నియోజకవర్గ ప్రజలకు అయ్యప్పస్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.