VKB: తాండూర్, పెద్దేముల్ మండలాల్లోని గ్రామాల్లో గత రెండు రోజులుగా రాత్రి సమయంలో ఆకాశంలో డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందడంతో తాండూర్ సీఐ నాగేష్ విచారణ చేపట్టారు. కొత్త వ్యక్తుల సంచారం కోణంలో ఫామ్ హౌస్లు, లాడ్జీలను తనిఖీ చేసి, సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.