TG: HYDలోని JNTU బ్రిడ్జిపై కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో డివైడర్‌ను, ఆ తర్వాత ఓ బైకును ఢీకొట్టి బోల్తా పడింది. కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత యువతులు కారు దిగి మరో క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. సూడాన్‌కు చెందిన యువకులు నగరంలో చదువుకుంటూ శంషాబాద్‌లో నివాసముంటున్నట్లు సమాచారం.