KMR: దోమకొండ చాముండేశ్వరి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా ఇవాళ ప్రత్యేక పూజలు చేసినట్లు ప్రధాన అర్చకుడు శరత్ చంద్ర శర్మ తెలిపారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కార్తీకమాస దీపోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇవాళ అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి అభిషేకం, కార్తీక జ్యోతి, లలితా సహస్రనామం చేసినట్లు పేర్కొన్నారు.