BDK: మణుగూరు రామానుజవరంలో భారత రాష్ట్ర సమితి నాయకులు లేళ్లకృష్ణ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, పార్టీ కార్యకర్తలు మరింత చురుకుగా, సమన్వయంతో ముందుకు సాగాలని జిల్లా పార్టీ అధ్యక్షులు, రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని నాయకులు తెలిపారు.