మెగాస్టార్ చిరంజీవిని కొత్తగా ఎన్నికైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్(TFJA) కమిటీ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా TFJA సభ్యులు మాట్లాడుతూ.. సినీ జర్నలిస్టుల సంక్షేమం కోసం హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో వారి కోసం హౌసింగ్ సొసైటీ, క్లబ్ హౌస్ ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు.