W.G: గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆచంట మండలం పెదమల్లంలో చోటుచేసుకుంది. పెరవలి మండలం మల్లేశ్వరానికి చెందిన బొలిశెట్టి నరసింహారాజు తన తాలూకా కుటుంబ ఆస్తులు పంపకాలు చేయడం లేదని మనస్థాపానికి గురయ్యారు. దీంతో శనివారం సాయంత్రం సరిహద్దులో ఉన్న పెద్దమల్లంలో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.