AP: తుఫాన్ ప్రభావం, తీవ్రతపై సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. ‘తీరప్రాంతాల్లో SDRF, NDRF బృందాలు మోహరించాలి. 27 వేల సెల్ టవర్లను డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేశాం. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలి. సముద్రంలోని పడవలను వెనక్కి రప్పించాలి’ అని సూచించారు.