MBNR: ఎలక్ట్రీషియన్లకు, ఎలక్ట్రికల్ దుకాణాల యజమానులకు అండగా ఉంటామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం వడ్డెర బస్తీలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రీషియన్ల సమస్యలు తనకు తెలుసునని వారికి నూతన కమిటీ హాల్ నిర్మించేందుకు నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.