సత్యసాయి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనధికార లేఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరో మూడు నెలల గడువు ఇచ్చిందని జిల్లా కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ తెలిపారు. 2026 జనవరి 23వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రణాళికాబద్ధ పట్టణ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.