కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎనిమిదో పే కమిషన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 60 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. అలాగే, రబీ సీజన్లో రైతులకు పోషకాల ఆధారిత సబ్సిడీ (NBS) అందించాలని కూడా నిర్ణయించింది.