సత్యసాయి: పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలకు ప్రశాంతి నిలయంలో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. నవంబర్ 18న నూతన రథంపై అంగరంగ వైభవంగా నిర్వహించే రథోత్సవంతో వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. నూతన రథం కోసం ప్రత్యేక మండపం ఏర్పాటు పనులు తుది దశకు చేరుకున్నాయి. లక్షలాది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు.