VZM: కొత్తవలస మండల కేంద్రంలో గల శ్రీ మరిడిమాంబ ఆలయ ప్రాంగణంలో శ్రీ మణికంఠ సేవాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదివారం పాల్గొన్నారు. ముందుగా ఆమె అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.