ప్రకాశం: కల్తీ మద్యం లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వై.పాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు అన్నారు. ఆదివారం వై.పాలెంలోని మద్యం దుకాణంలో కల్తీ మద్యం ఘటనలను పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడానికి ఎక్సైజ్ శాఖ తీసుకొచ్చిన సురక్ష యాప్ విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏ స్థాయిలోని వ్యక్తులైనా కల్తీ మద్యాన్ని ప్రోత్సహించే వారిని హెచ్చరించారు.