KDP: జిల్లాలో అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉన్నందున సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి ఫిర్యాదుల పరిష్కార వేదికకు రాకూడదని ఎస్పీ తెలిపారు.