GNTR: కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే భక్తులు యజ్ఞాల బావి వద్ద పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఉపకమిషనర్ గోగినేని లీలాకుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఒక్క ఆదివారం రోజున సేవా విరాళాల ద్వారా దేవస్థానానికి రూ. 7.50 లక్షల ఆదాయం వచ్చింది.